Tuesday, August 25, 2026
E-PAPER
Homeఆటలుఆసియా క్రీడలకు నలుగురు దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారుల ఎంపిక

ఆసియా క్రీడలకు నలుగురు దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారుల ఎంపిక

- Advertisement -

టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

 ఆసియా క్రీడలు-2026 జపాన్‌లోని ఐచి-నగోయాలో వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ నాలుగు వరకు జరగనున్న సంగతి తెలిసిందే. 45 దేశాలకు చెందిన అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక బహుళ-క్రీడల క్రీడోత్సవంలో 43 రకాల క్రీడాంశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, 2026లో జరగనున్న 20వ ఆసియా క్రీడలలో ‘టీమ్ ఇండియా’కు ప్రాతినిధ్యం వహించేందుకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన నలుగురు కబడ్డీ క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తమవుతున్నది.
ఎంపికైన క్రీడాకారులు
మహిళల జట్టులో లాలాగూడలోని ఎలక్ట్రిక్ లోకోషెడ్ (సీనియర్ మెటీరియల్ మేనేజర్ కార్యాలయం)కు చెందిన ఆఫీస్ సూపరింటెండెంట్ కుమారి రీతూ నేగి . మెట్టుగూడలోని సిగ్నల్, టెలికమ్యూనికేషన్ విభాగం (చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ కార్యాలయం)కు చెందిన సీనియర్ టెక్నీషియన్ కుమారి పింకీ రాయ్ ఉన్నారు. అలాగే పురుషుల జట్టులో సికింద్రాబాద్‌లోని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కార్యాలయానికి చెందిన ప్రోబేషనరీ కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ అయాన్ లోచబ్ , కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ మిత్ సాంగ్వాన్ సైతం ఆసియి క్రీడలకు ఎంపికయ్యారు. జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చర్‌లోని టోకైలో ఉన్న టోకై సిటిజన్స్ జిమ్నాసియంలో వచ్చే సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 26 వరకు జరగనున్న టోర్నమెంట్‌లో పోటీపడనున్న 12 మంది సభ్యుల భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లలో ఈ క్రీడాకారులు భాగంగా ఉంటారు. భారత కబడ్డీ బృందానికి దక్షిణ మధ్య రైల్వే కు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడం, దక్షిణ మధ్య రైల్వేకే కాకుండా మొత్తం భారతీయ రైల్వేలకు ఎంతో గర్వకారణమని అధికారులు తెలిపారు. క్రీడలను ప్రోత్సహిం చడానికి, తమ ఉద్యోగులలో ప్రతిభను పెంపొందిం చడానికి దక్షిణ మధ్య రైల్వే కొనసాగిస్తున్న నిరంతర కృషిని తెలియజే స్తుందన్నారు. దక్షిణ మధ్య భారత కబడ్డీ జట్లకు ఎంపికైన దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారులను రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు. ఆసియా క్రీడల్లో పాల్గొననున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. క్రీడారంగంలో వారు కనబరుస్తున్న అంకితభావం, కృషి , విజయాలను ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై వారంతా రాణించి, దేశానికి, భారతీయ రైల్వేకు, దక్షిణ మధ్య రైల్వేకు కీర్తి ప్రతిష్టలు తెస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -