తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు
వనం శాంతి కుమార్, ముషం నరహరి
ఖమ్మం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-ఖమ్మం కలెక్టరేట్
చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వనం శాంతి కుమార్, ముషం నరహరి అన్నారు. ఖమ్మం నగరంలోని టీఎస్ యూటీఎఫ్ భవన్‌లో చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. త్రిఫ్ట్ పథకంలో చేనేత కార్మికులు 16 నెలల నుండి రికరింగ్ డిపాజిట్ చేస్తున్నా ప్రభుత్వం రెండు నెలలు మాత్రమే డిపాజిట్ చేసి మిన్నకుండి పోయిందని విమర్శించారు. మిగతా నెలలు వెంటనే డిపాజిట్ చేయాలని అన్నారు. నేతన్న భరోసా సైతం మూడు నెలలు మాత్రమే జమ చేశారని మిగతావి కూడా జమ చేయాలని కోరారు. 2026 మార్చి 25న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తే సహకార సంఘాల ఎన్నికలు జరిగాయని తెలిపారు. మగ్గం లేని వారికి స్థాండ్ మగ్గాలు ఇవ్వాలని, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద హౌస్ కమ్ వర్క్ షెడ్‌ను హ్యాండ్ లూమ్ టెక్స్ టైల్ శాఖ నుంచి మంజూరు చేయాలని కోరారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా ఇవ్వాలని, సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ ఋణం మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా నూతన కన్వీనింగ్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులుగా జి.శ్రీనివాస్, కె.వెంకటేశ్వర్లు, సామల వీరభద్రం, కె.వెంకటనర్సయ్య, రావిరాల సత్యనారాయణ, పర్వతం వేణుగోపాల్ రావు, హన్మంత రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జి.శ్రీనివాస్, కె.వెంకటేశ్వర్లు, వీరభద్రం, కె.వెంకటనర్సయ్య, రావిరాల సత్యనారాయణ, పర్వతం వేణుగోపాల్ రావు, హన్మంత రావు తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



