Friday, June 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజులై 16న గోల్కొండ బంగారు బోనం

జులై 16న గోల్కొండ బంగారు బోనం

- Advertisement -

షెడ్యూల్ ప్రకటించిన మల్యాల మధుసూదన్ యాదవ్
నవతెలంగాణ – చార్మినార్
ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ పాతబస్తీలో ఏర్పాట్లు సాగుతున్నాయని భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మెన్ మల్యాల మధుసూదన్ యాదవ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌‌లో నిర్వహించిన సమావేశంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిలాగే ఈసారి కూడా సప్తమాతృకలకు సప్త బం గారు బోనాల పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలి పారు. బంగారు పాత్రల్లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆయా అమ్మవార్లకు సమర్పిస్తామని చెప్పారు. హరిబౌలీలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బంగారు బోనాలను సామూహిక ఊరేగింపుగా వివిధ దేవాలయాలకు తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించే కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

​16న గోల్కొండలో ప్రారంభం​
ఈ ఏడాది బోనాల మహోత్సవాలకు జులై 16న గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పణతో శ్రీకారం చుడతామని తెలిపారు. అనంతరం జులై 31న కలశ స్థాపన, ఆగస్టు 2న ఘట స్థాపన ఊరేగింపు, ఆగస్టు 9న అమ్మవారికి బోనాల సమర్పణ, ఆగస్టు 10న పాతబస్తీలో ఘటాల సామూహిక పరిసమాప్తి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు.

​సప్తమాతృకలకు సప్త బంగారు బోనాలు
సప్తమాతృకల సప్త బంగారు బోనాల కార్యక్రమంలో భాగంగా జులై 16న గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బంగారు బోనం సమర్పించనున్నారు. 19న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, 22న బల్కంపేట ఎల్లమ్మ తల్లి, 26న విజయవాడ కనకదుర్గమ్మ, 30న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఆగస్టు 4న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, ఆగస్టు 6న లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించనున్నట్టు మధుసూదన్‌ తెలిపారు. అదేవిధంగా ‌జులై 19న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించే ముందు హరిబౌలీలోని బంగారు మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక బంగారు బోనం సమర్పించనున్నట్టు చెప్పారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఊరేగింపుగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి చేరుకుని బంగారు బోనాన్ని సమర్పించనున్నట్టు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -