Tuesday, September 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఒప్పందానికి రాకుంటే తుడిచిపెడతా

ఒప్పందానికి రాకుంటే తుడిచిపెడతా

- Advertisement -

ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక
ప్రతీకారం తప్పదు : టెహ్రాన్‌
టెహ్రాన్‌/వాషింగ్టన్‌ :
ఇరాన్‌, అమెరికా దేశాల మధ్య మరోసారి బెదిరింపుల పర్వం మొదలైంది. తనతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ ఆర్థికంగా దెబ్బతింటుందని లేదా నాయకత్వం తుడిచిపెట్టుకొనిపోతుందని అమెరికా బెదిరించగా తనపై దాడి జరిగితే ప్రతీకారం తప్పదని టెహ్రాన్‌ హెచ్చరించింది. ఫాక్స్‌ న్యూస్‌ ప్రతినిధితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ఇరాన్‌ నేతలు తనతో ఒప్పందం చేసుకోని పక్షంలో ఆర్థికంగా నాశనం అవుతారని, నామరూపాలు లేకుండా పోతారని శాపనార్థాలు పెట్టారు. ఐరాస సర్వసభ్య సమావేశం కోసం ఈ వారంలో న్యూయార్క్‌ వస్తున్న ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ను కలవడానికి తాను సిద్ధమేనని ట్రంప్‌ ఈ సందర్భంగా చెప్పారు. కాగా ఇరాన్‌పై దాడులు జరిగితే అమెరికా స్థావరాలు, ప్రయోజనాలపై ప్రతీకార చర్యలకు దిగుతామని, ప్రాంతీయ మిత్రదేశాలను కూడా కలుపుకుంటామని సైనిక కేంద్ర కమాండ్‌ తెలియజేసింది.
ఇదిలా ఉండగా హౌతీల తాజా దాడులపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ వీటి కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని, అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని, విమానాల రద్దు, గగనతలాల మూసివేత వంటి చర్యలకు అవకాశం ఉన్నదని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -