ఫేస్‌బుక్ కాదు.. పాఠ్యపుస్తక పఠన
సంస్కృతి పెరగాలి : రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ప్రపంచానికి గొప్ప మానవ వనరులను అందిస్తున్న దేశం భారత్ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ డాక్టర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని సూచించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని పీఎం జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం శక్తి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పేస్ ఆన్ వీల్స్’ ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, ఈ రంగంలో యువత మరింతగా ముందుకు రావాలని కోరారు. యువ సంపదే దేశానికి అత్యుత్తమ వనరని చెప్పారు. ఉన్నత విద్యామండలి ప్రవేశపెడుతున్న నూతన కోర్సులు దేశ, విదేశాల్లోని విద్యా ప్రమాణాలకు దీటుగా ఉన్నాయని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి అంతరిక్ష సాంకేతికత వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు.
సాంకేతికతను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశ భవిష్యత్ అంతా అంతరిక్ష సాంకేతికతతో ముడిపడి ఉందని, నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపు చ్చుకోవాలని చెప్పారు.
ఫేస్‌బుక్ ద్వారా జ్ఞానం పెరగదని, పుస్తక పఠనం వల్లే విజ్ఞానం విస్తరి స్తుందని తెలిపారు.అంతరిక్ష చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల అభ్యున్నతికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శక్తి యూత్ సేవలను అభినందించారు. గతంలో డిగ్రీలు దండగ అనే భావన ఉండేదని, ప్రస్తుతం డిగ్రీలు పండుగగా మారాయని అన్నారు. అనంతరం అంతరిక్ష సాంకేతికతపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రదర్శనలో భాగంగా స్పేస్ ఆన్ వీల్స్ బస్సు, రాకెట్లు, ఇస్రో ప్రయోగాలు, గ్రహాలు, చంద్రయాన్ నమూ నాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. శక్తి యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు తలారి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఎస్‌ఈ స్టూడెంట్ అండ్ పబ్లిక్ అవుట్‌రీచ్ డివిజన్ హెడ్ డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఎంపీడీవో ముక్కపాటి నరసింహారావు, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, చిలుకూరు పీఏ సీఎస్ చైర్మన్ అలసకాని జనార్దన్, ఎంఈవో శివ కుమారి, హెచ్‌ఎం రాజారాం, శక్తి యూత్ సభ్యులు టి.రాము, పుల్లారావు, రాజు, నాగరాజు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రపంచానికి గొప్ప మానవ వనరులు అందిస్తున్న భారత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



