Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి శ్రీధర్ బాబు

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

300 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుడిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కాటారం, మల్హర్,  మహాదేవపూర్, మహా ముత్తారం మండలాలకు చెందిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు పెద్ద ఎత్తున నాలుగు మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

మంజూరైన లబ్ధిదారులు 45 రోజులలోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో అర్హులకు లబ్ధి జరగలేదని ఈ ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్న బియ్యం, అర్హులైన లబ్ధిదారులకు  ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు. రైతులకు వ్యవసాయ అవసరాలకు సరిపడ ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఒక సంవత్సరంలో రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించామని తెలిపారు. మహిళలను బస్సులకు అధిపతులు చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు 45 రోజులలోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.  మూడు విడుదల లబ్ధిదారుల అకౌంట్లో డబ్బు జమవుతుందని పూర్తి పారదర్శకంగా 360డిగ్రీల లో ఏఐ టెక్నాలజీ ద్వారా లబ్ధిదారుల విచారణ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఇందిర మహిళల లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాల అందజేసి నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు. 

ఈ రోజు మొదటి విడతలో నిర్మాణాలు జరిపిన ఇందిరమ్మ ఇళ్లను మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్పి సిరిశెట్టి సంకీర్త్,  అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్,  ఆర్డిఓ రవీందర్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, ఉపాధి హామి పధకం రాష్ట్ర సభ్యులు దండు రమేష్, గ్రంధాలయ చైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, పిఎసిఎస్ చైర్మన్  తిరుపతి రెడ్డి   తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -