కార్యక్రమం ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు
నవతెలంగాణ-మక్తల్
జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మక్తల్ మండల్ మాద్వార్ గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్నంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు నేరుగా వెళ్లి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సంర్భంగా ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ వెంకట్ రాములు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన, క్రీడా సదుపాయాలు మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన అందిస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక సౌకర్యాలతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాయని తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది ప్రభుత్వ పాఠశాలలేనని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొని బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలోని తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆసక్తి చూపుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రావడం విశేషం. ఈ ఉపాధ్యాయులు రామాంజనేయులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



