Thursday, August 13, 2026
E-PAPER
Homeఆటలుఇషా సింగ్‌ ‌వరల్డ్‌ ‌నం.1

ఇషా సింగ్‌ ‌వరల్డ్‌ ‌నం.1

- Advertisement -

ప్రపంచ షూటింగ్‌ ‌ర్యాంకింగ్స్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ :

భారత స్టార్‌ ‌షూటర్‌, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ ‌ప్రపంచ ర్యాంకింగ్స్‌‌లో టాప్‌ ‌లేపింది. ఇటీవల వరుసగా మ్యూనిచ్‌, హాంగ్జౌ ప్రపంచకప్‌‌లలో పసిడి పతకాలు సాధించిన ఇషా సింగ్‌ ‌ర్యాంకింగ్స్‌‌లో అగ్రస్థానికి ఎగబాకింది. మహిళల 25మీటర్ల పిస్టల్‌ ‌విభాగంలో 6384 పాయింట్లతో ఇషా సింగ్‌ ‌వరల్డ్‌ ‌నం.1గా నిలిచింది. యాంగ్‌ ‌జిన్‌ (‌దక్షిణ కొరియా-5834), షియావో (చైనా-4498), మను భాకర్‌ (‌భారత్‌-2002), యావో (చైనా-2005) టాప్‌-5‌లో నిలిచారు. మహిళల 10మీటర్ల ఎయిర్‌ ‌పిస్టల్‌ ‌విభాగంలో యావో (చైనా-7630) అగ్రస్థానం నిలుపుకోగా.. ఇషా సింగ్‌ 4961 ‌పాయింట్లతో రెండో ర్యాంక్‌‌కు ఎగబాకింది. సురుచి సింగ్‌ (‌భారత్‌-4042) మూడో స్థానంలో కొనసాగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -