అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పళ్ళబురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకుడు. ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ చౌహాన్ మీడియాతో ముచ్చటించారు. మాది మహబూబ్‌నగర్ జిల్లా. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ముంబైలో యాడ్ ఫిల్మ్స్‌కు అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. 2016లో హైదరాబాద్‌కు వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇండిపెండెంట్‌గా ఒక సినిమా చేసి ఫెస్టివల్స్‌కు పంపించాను. అదే సమయంలో డిస్నీ+ హాట్‌స్టార్ నుంచి అవకాశం వచ్చింది. అక్కడ మూడేళ్లు పనిచేశాను. ఈ కథ రాసుకున్న తర్వాత ఒక మంచి బ్యానర్ కోసం చూస్తున్న సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో కథ చెప్పే అవకాశం వచ్చింది. ఇందులో చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అదే సమయంలో మనసును హత్తుకునే ఒక సందేశం కూడా ఉంది. ఈ సినిమాలో కేవలం ‘పళ్ళ బురుసు’ అనే అంశం మాత్రమే కాదు. చాలా లేయర్స్ ఉన్నాయి. అవన్నీ మీరు థియేటర్‌లో చూస్తారు. ఈ సినిమా నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ పాత్రలు మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాయి. నాగార్జున సినిమా చూసి చాలా హార్ట్ టచిం గ్‌గా ఉందని అన్నారు. సినిమా డైలాగ్స్ చాలా బాగున్నా యని చెప్పారు. అదే సమయంలో ఎక్కడా బోర్ కొట్టలేదన్నారు.
నాగార్జున మెచ్చుకున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



