– పలు గ్రామాల్లో కళాశాల ఉపాధ్యాయుల ప్రచారం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు శనివారం కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాలలో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, సైన్స్ కు సంబంధించిన ప్రయోగశాలలు, ప్రతి రోజూ స్లిప్ టెస్టుల నిర్వహణ, వారాంతపు టెస్టులు, విద్యార్థిని విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడల ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులతో మా పిల్లలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే అడ్మిషన్ తీసుకొని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న అవకాశాలను వినియోగించుకొని కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి కోరారు. ఈ అడ్మిషన్ డ్రైవ్ లో అధ్యాపకులు వెంకటేష్, శ్రీహరి, గంగారాం, మురళి, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



