రాష్ట్రవ్యాప్త నిరసన విజయవంతం
కలెక్టర్లకు టీడబ్ల్యూజేఎఫ్‌వినతిపత్రాలు
దద్దరిల్లిన కలెక్టరేట్లు
వందలాదిగా పాత్రికేయుల రాక
15న ఛలో సమాచార్ భవన్
నవతెlలంగాణ-హైదరాబాద్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. రాష్టంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జర్నలిస్టులు ఇందులో పాల్గొన్నారు. దర్ఘీకాలికంగా పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్లు, ఇండ్లస్థలాలు, హెల్ల్‌కార్డుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ బస్సుపాసులను పూర్తిగా ఉచితం చేయాలని కోరారు. ఇకపోతే జర్నలిస్టులకు కొత్తగా మెట్రో రైల్ పాసు సైతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్ల దగ్గర ఫీజును జర్నలిస్టులకు రద్దుచేయాలని సూచించారు. నిరసన కార్యక్రమం హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, ములుగు, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, జగిత్యాల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, సూర్యాపేట, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీస్థాయిలో నిరసన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ జిల్లాలో ఫెడరేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి.రాంచందర్, రంగారెడ్డి జిల్లాలో ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, వరంగల్‌లో ఉపాధ్యక్షులు ఈ చంద్రశేఖర్, బి దయాసాగర్, జగిత్యాలలో గుడిగ రఘ, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో సలీమ, హైదరాబాద్‌లో ఆఫీసు బేరర్లు గండ్ర నవీన్, బి దామాదర్, బి రాజశేఖర్, హెయ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్‌కుమార్, బి. జగదీశ్, సంగారెడ్డిలో వై. ప్రభాకర్ తదితర ఆఫీసు బేరర్లతోపాటు రాష్ర్ట కార్యవర్గ సభ్యులు, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు , జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాత్రికేయుల సమస్యలపై నినాదాలు చేశారు. కలెక్టరేట్ల ముందు భైటాయించారు. అక్రిడిటేషన కార్డుల జారీని వేగవంతం చేయాలనీ, ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఎర్రటి ఎండలోనూ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళా జర్నలిస్టులు సైతం పాల్గొనడం విశేషం. 40 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంలోగానీ, తెలంగాణలోగానీ ఇండ్లస్థలాలు ఇవ్వలేదని రాంచందర్, బసవపున్నయ్య ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అక్రిడిటేషన్ల జారీ విషయంలో యూనియన్ రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికాదరు.
ప్రభుత్వం 47 వేల అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్దమని చెబితే, మధ్యలో కొందరు అడ్డుపడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కార్డులు ఇవ్వకుండా జర్నలిస్టులపై కక్ష గట్టారని విమర్శించారు. బాధ్యత తీసుకుని అందరికీ న్యాయం చేయకుండా, యూనియన్ల పేర అక్రిడిటేషన్ కార్డులను తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ఈనెల 15న హైదరాబాద్‌లోని సమాచార,పౌరసంబంధాల కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలిపారు. ఛలో సమాచార్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాత్రికేయలోకానికి విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



