Wednesday, September 23, 2026
E-PAPER
HomeNewsజూరాల నీటి విడుదలపై హర్షం: మాజీ ఎమ్మెల్యే చిట్టెం

జూరాల నీటి విడుదలపై హర్షం: మాజీ ఎమ్మెల్యే చిట్టెం

- Advertisement -

నవతెలంగాణ-ఆత్మకూర్
ఎట్టకేలకు బుధవారం ఉదయం జూరాల ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయటం పట్ల మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆత్మకూరు పట్టణంలోని బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పిలుపులో భాగంగా రైతులందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రైతులకు ఏ కష్టం వచ్చినా  బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లప్పుడూ రైతులకు మద్దతుగా ఉంటారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్, మున్సిపల్ మాచి చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాస్, మాజీ, వైఫ్ ఎంపీపీ కోటేష్, లక్ష్మి కాంత్ రెడ్డి, బాల్ రాజ్, వీరిశలింగం, లక్ష్మీ కాంత్ రెడ్డి, మండ్ల రామకృష్ణ, ఎండి రియాజ్ అలీ, చెన్నయ్య, షరీఫ్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -