నవతెలంగాణ – హైదరాబాద్ : ‘ఇరుముడి’ సినిమాలో కొమరక్క పోషించిన ‘నాగులు’ పాత్రకి మంచి గుర్తింపు రావడతో ఈవెంట్ లో కన్నీళ్లకు పెట్టుకున్నాడు. ‘కొమరక్క’గా టీవీలలో కనిపిస్తూ వచ్చిన ‘కొమరం’ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించి షాక్ ఇచ్చాడు. ఆ సినిమాలో ఆయన నటన ఆడియన్స్ కి నచ్చేసింది. ఈ తరహా పాత్రలు కూడా ‘కొమరం’ గొప్పగా చేయగలడనే ఒక నమ్మకం వచ్చింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్లలో .. 12 ఏళ్లనుంచి ‘కొమరక్క’గా లేడీ గెటప్ లోనే కనిపిస్తూ వస్తున్నాననీ, తాను ఆ పాత్ర తప్ప వేరే ఏవీ చేయలేనని చెప్పుకున్నారని అన్నాడు. ఇకపై తనని ‘కొమరక్క’గా కాకుండా ‘నాగులు’గా గుర్తుపెట్టుకునేలా ‘ఇరుముడి’ చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజంగానే కొమరం కన్నీళ్లకో అర్థం ఉందని ఎవరికైనా అనిపిస్తుంది. తనని నటుడిగా నిరూపించుకునే ఒక అవకాశం ఒక నటుడిని ఎంతగా కదిలిస్తుందనేది స్టేజ్ పై కొమరంను చూస్తే అర్థమవుతుంది. ఇకపై కొమరానికి డిఫరెంట్ రోల్స్ రావాలనీ .. నటుడిగా ఆయనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే అవకాశాలు రావాలని ఆశిద్దాం.
ఇరుముడి ఈవెంట్ లో కొమరం కన్నీళ్లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


