Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకుందాం

కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకుందాం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
పేద ప్రజల అభ్యున్నతికి పని చేసిన స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ నాయకులు, కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుద్దామని హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆలేరు చైర్మన్ దాసి శంకర్ యువతకు పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలో సోమవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతి సభ సందర్బంగా హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో చిత్రపటానికి, కొండా లక్ష్మణ్ బాపూజీ  విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చెరుకుగా పని చేశారని, అదేవిధంగా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలోనూ మంత్రి పదవిని త్యాగం చేశారని కొనియాడారు. బాపూజీ త్యాగాలు వెలకట్టలేనివని, స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో పాల్గొనడమే ఆయనకు నిజమైన నివాళులు పెంచినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ చింతకింది మురళి, సంఘం కార్యదర్శి గాడిపెల్లి రమేష్, వైస్ చైర్మన్ చింతకింది రంగ, సహాయ కార్యదర్శి బింగి నర్సింహులు, డైరెక్టర్స్ అందె రాములు, ఎలగందుల పద్మ, బేతి భాగ్య, మాజీ కార్యదర్శి ఎలాగందుల రామారుషి, చేనేత నాయకులు చింతకింది రామానుజం, రచ్చ హన్మంతు, రేగోటీ వెంకటేష్, గుజ్జ అశోక్ చింతకింది సిద్దులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -