- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉద్యోగ్ భవన్ మెట్రో స్టేషన్ సమీపంలోని స్లమ్ ఏరియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ ప్యానెల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 20 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తోంది.
- Advertisement -


