Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబజాజ్ ఆటో సంస్థపై భారీ సైబర్ దాడి

బజాజ్ ఆటో సంస్థపై భారీ సైబర్ దాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ తమ ఐటీ వ్యవస్థలపై రాన్సమ్‌వేర్ దాడి జరిగినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ సైబర్ దాడిని గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఘటనలో తమ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ వ్యవస్థలు కూడా ప్రభావితమైనట్లు వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వివరాలను పొందుపరిచింది. దాడిని గుర్తించిన వెంటనే తమ సాంకేతిక బృందాలు, యాజమాన్యం, బాహ్య సైబర్ సెక్యూరిటీ నిపుణులతో కలిసి తక్షణ నివారణ చర్యలు చేపట్టినట్లు బజాజ్ ఆటో పేర్కొంది. ఈ చర్యల వల్ల నష్టం చాలా వరకు అదుపులోనే ఉందని వివరించింది. నిబంధనల ప్రకారం ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కు కూడా సమాచారం అందించినట్లు స్పష్టం చేసింది. అయితే, ఈ దాడి వల్ల ఎంత మేర డేటా చోరీకి గురైంది, కార్యకలాపాలపై ప్రభావం ఎంత, ఆర్థికంగా ఎంత నష్టం వాటిల్లింది అనే వివరాలను బజాజ్ ఆటో వెల్లడించలేదు. ఉత్పత్తి కార్యకలాపాలపై ఈ దాడి ప్రభావం గురించి కూడా కంపెనీ తొలి ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -