నవతెలంగాణ-జగిత్యాల టౌన్: జగిత్యాల టౌన్‌లో మేడే వేడుకలకు మంత్రి ఆడ్లూరీ లక్ష్మణ్ ఆలస్యంగా హాజరైయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం మధ్యాహ్నాం 12గంటలైన హాజరుకాలేదు. ఆయన కోసం జిల్లా కలెక్టర్, ఇతర సంబంధిత అధికారులు సుదీర్ఘంగా వేచి ఉన్నారు. కార్యక్రమముకు హాజరైన కార్మికులు, ప్రజలు, ఇతరులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంత్రి ఆలస్యంగా రావడంతో వేడుకలకు హాజరైన వారందరికీ సమోసాలు పంపిణీ చేయడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా మంత్రి హాజరయ్యే కార్యక్రమాలకు సమయానుకులంగా రావాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కాగా,జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్, సహాయ కార్మిక కమిషనర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించే మేడే వేడుకలు ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల సముదాయంలో నిరహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి కార్మికులు, యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘ నాయకులు, ప్రజలందరూ హాజరుకావాలని డీపీఆర్వో శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరవుతారని ఏప్రిల్ 30న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కానీ మంత్రి ఆలస్యంతో మేడే వేడుకలు ఆలస్యంగా హాజరైయ్యారు.



