– అభినందించిన పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ మొండ్రు రత్నాకర్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండల స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలలో స్థానిక సిద్ధారం రోడ్డులోని ‘మిరాకిల్ మైండ్స్’ స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. అండర్-17 బాలుర విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో 9వ తరగతి విద్యార్థి పార్థు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అండర్-14 బాలికల విభాగంలో 7వ తరగతి విద్యార్థిని సాత్విక 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంతో పాటు లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా విజేతలను మిరాకిల్ మైండ్స్ స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ మొండ్రు రత్నాకర్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రత్నాకర్ మాట్లాడుతూ… విద్యార్థుల నిరంతర కృషి, క్రీడా ఉపాధ్యాయుల అత్యుత్తమ శిక్షణే ఈ విజయానికి కారణమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో విద్యార్థులు క్రీడల్లో మరిన్ని ఉన్నత మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
మండల స్థాయి అథ్లెటిక్స్ లో ‘మిరాకిల్ మైండ్స్’ విద్యార్థుల ఘన విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



