నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎన్డీడిలో భాగంగా మోప్ ఆప్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్లలో, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో గత వారం జరిగిన నులి పురుగుల నివారణ కార్యక్రమంలో ఆల్బెండజల్ మాత్రలు వేసుకోలేని విద్యార్థులను గుర్తించి వారికి ఆల్బెండజలు మాత్రలు పంపిణీ చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు నట్టల నివారణ ద్రావణాన్ని త్రాగించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది నులిపురుగుల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు భోజనం చేసే ముందు భోజనం చేసిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ నరసింహ స్వామి, సూపర్వైజర్ ఆకుల మారుతి, బుచ్చమ్మ, మహేందర్, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో మోప్ ఆప్ డే కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



