Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని కామారెడ్డి పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి సురక్షితంగా రక్షించారు. కుటుంబ సభ్యులు డయల్-100కు సమాచారం అందించగానే బీసీ కానిస్టేబుల్ అరుణ్‌తో పాటు పోలీసు సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం 10 నిమిషాల్లోనే రైల్వే ట్రాక్‌పై ఉన్న ఆ వ్యక్తిని గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వై.ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ..ప్రతి ప్రాణం అమూల్యమైనదని, సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని అన్నారు. ఆపదలో ఉన్నవారు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు సమాచారం అందిస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారని తెలిపారు. మానసిక ఒత్తిడి లేదా నిరాశతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, అవసరమైతే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం పొందాలని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -