Thursday, June 4, 2026
E-PAPER
Homeసినిమా'వంద దేవుళ్ళు`త్వరలోనే రాబోతున్నారు

‘వంద దేవుళ్ళు`త్వరలోనే రాబోతున్నారు

- Advertisement -

విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్‌ తరువాత విజయ్ ఆంటోని హీరోగా, శశి దర్శకత్వంలో ‘వంద దేవుళ్ళు’ అనే చిత్రం రాబోతోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌‌ను ప్రకటించారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ మూవీని ఈనెల 19న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరా మెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -