Friday, June 5, 2026
E-PAPER
Homeవరంగల్విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: డిఐజి వివి.రమణ రెడ్డి

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: డిఐజి వివి.రమణ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గంలోని 43 మామునూర్ 4వ బెటాలియన్‌ను టీజీఎస్పి, బెటాలియన్ డీఐజీ వి.వి.రమణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్డి.శివ ప్రసాద్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.అనంతరం డిఐజి బెటాలియన్‌లో మోటార్ ట్రాన్స్ పోర్ట్, బెటాలియన్ వెల్ఫేర్,హెడ్ క్వార్టర్, యూనిట్ హాస్పిటల్,పెట్రోల్ బంక్, క్వార్టర్ మాస్టర్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ హాల్లో బెటాలియన్ ఉన్నతాధికారులతో, మినిస్ట్రీయల్ సిబ్బందితో మాట్లాడారు మాట్లాడి, బెటాలియన్ సిబ్బంది యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సూచనలు ఇచ్చారు.ఫైరింగ్ రేంజ్ ను పరిశీలిచి దాని నిర్వహణ,ఫైరింగ్ సమయంలో ఎలాంటి అవాంచననీయ సంఘటనలు జరగకుండా నూతన సాకేతికతతో నిర్మించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు మూర్తుజా రెహమాన్, బాలయ్య,రాజేందర్ మరియు ఆర్ఐలు,ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -