నవతెలంగాణ – పరకాల
ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇకపై డివిజన్ స్థాయిలోనూ పకడ్బందీగా నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి ఆదేశాల మేరకు, పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వికేంద్రీకరణలో భాగంగా డివిజన్ స్థాయిలోనే ఆర్డీవో ఆధ్వర్యంలో వినతులను స్వీకరిస్తారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, 30 రోజుల్లోపు పరిష్కరించాలని, బాధితులకు తమ ఫిర్యాదు స్థితిని తెలుసుకునే వీలుంటుందని అధికారులు తెలిపారు. సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ చౌహాత్ బాజ్ పాయి స్పష్టం చేశారు.
సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో ‘ప్రజావాణి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



