నవతెలంగాణ – బల్మూరు
మండల కేంద్రం బల్మూరులోని చెంచు కాలనీకి చెందిన మంగమ్మ (35 ) నివాసానికి సమీపాన ఉన్న మొల్ల చెరువులో నీట మునిగి చనిపోయిన సంఘటన శనివారం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి భార్యాభర్తలు తగవులాడుకొని చెరువులో భార్య వెళ్లి నీటిలో పడి నీటముడిగిందని కొందరు చెబుతున్నారు. సారా, కళ్ళు తాగి మత్తులో గొడవపడి వెళ్లి నీటిలో పడినట్టు మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై బంధువులు కొందరు భర్త చేత ఫిర్యాదు ఇవ్వకుండా పిల్లల చేత ఫిర్యాదు ఇప్పిస్తున్నట్లు తెలిపారు. మా అమ్మానాన్న గొడవ పడి తాగిన మైకంలోనే ఇలా జరిగి ఉంటుందని ఫిర్యాదు చేస్తున్నట్లు చుట్టుపక్కల వారు బంధువులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
చెరువులో పడి మహిళ అనుమానాస్పద మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



