- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వారపు సంత వద్ద హైవే పక్కన ఆదివారం తెల్లవారుజామున ఒక ప్రయివేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఒడిశా నుంచి చెన్నై వెళ్తున్న ఈ బస్సు అదుపుతప్పి పంట కాలువలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
- Advertisement -



