Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు 

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్  
మున్సిపల్ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ బీజానమ్మ బాలమణి భాస్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో కొత్తపల్లి జయశంకర్ ఉద్యమ నీతి విలువైన దాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లెల సరిత, జూకంటి సంపత్, జెట్ట నీరజ,  కో ఆప్షన్ సభ్యులు చింతకింది మురళి, మున్సిపల్ మేనేజర్ బి. జగన్ మోహన్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రైల్వే గేట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, కౌన్సిలర్ యాట శివ, సెక్రటరీ జనరల్ కుండేసంపత్, పూల శ్రావణ్,  గోరెమియా, మంగ అరవింద్, ఎల్లేష్, మహమూద్, ఫయాజ్,ఎలుగలహరికృష్ణ, చందు, మొగిలిపాక కృష్ణ, పల్లె మహేష్, సంగి నాగరాజు,సుకృత్, ఎలుగల నరేష్ పూల కళ్యాణ్,టీంకు,నవీన్, చింత కాయల అనిల్,బన్నీ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -