Thursday, July 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణాకు పీఆర్టీయూ టీఎస్ అభినందనలు

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణాకు పీఆర్టీయూ టీఎస్ అభినందనలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం విద్యా ప్రమాణాల్లో 29వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరడంలో కృషి చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాకు పీఆర్టీయూ టీఎస్ అభినందనలు తెలిపింది. ఇటీవల విడుదలైన విద్యా ప్రమాణాల మూల్యాంకనంలో తెలంగాణ రాష్ట్రం 29వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకోవడం రాష్ట్ర విద్యారంగానికి గర్వకారణమని అభివర్ణించింది. ఈ విజయానికి కృషి చేసిన యోగితా రాణాను ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి సారథ్యంలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు విద్యాశాఖ పకడ్బందీ ప్రణాళికతో పనిచేసి, సుమారు 200 అంశాల ఆధారంగా జరిగిన సమగ్ర మూల్యాంకనంలో తెలంగా ణకు ఈ మెరుగైన స్థానం లభించడం అభినందనీయమని తెలిపారు.ఈ పురోగ తిలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ సమిష్టి కృషి కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ ఆడిట్ కమిటీ చైర్మెన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -