నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక గ్రామసభను నిర్వహించారుమండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ అధ్యక్షతన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అట్టడుగు వర్గాల ప్రజలకు అందేలా ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మహిళలకు ఉచిత బస్, ప్రతి ఇంటికి ఉచిత కరెంటు, ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సన్నం వడ్లకు బోనస్ లాంటి కార్యక్రమలు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.హాస కొత్తూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముగింపు గ్రామ సభలో సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన విధానాలను గ్రామ సభకు వచ్చిన గ్రామ ప్రజలకు నిర్వహించారు.ఈ గ్రామ సభల్లో ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్, తహసిల్దార్ నరేష్, వచ్చిన ఎస్ఐ సతీష్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, మండల గ్రామస్థాయి అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



