- Advertisement -
దళిత సంఘం నాయకులు జంగయ్య
నవతెలంగాణ-మిడ్జిల్
మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు భద్రత కల్పించాలని దళిత సంఘం నాయకులు పేరుమల జంగయ్య, మసిగుండ్లపల్లి దేవాలయ చైర్మన్ వెంకటయ్య ఎంపీడీవో లక్ష్మణ్ రాథోడ్ కు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈనెల 15న కస్తూర్బా పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినీ తల్లి పాఠశాలలో వదిలి వెళ్ళితే విద్యార్థి ఊరుకొండ మండలంలోని గుట్టలలో ప్రత్యక్షం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన గురవుతున్నారని పేర్కొన్నారు. పాఠశాల నుండి విద్యార్థి వెళ్లిపోతే సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదని నిర్లక్ష్యం వహించిన పాఠశాల సిబ్బందిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -



