Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హైదరాబాద్‌కు తరలిన పరకాల మున్సిపల్ కార్మికులు

హైదరాబాద్‌కు తరలిన పరకాల మున్సిపల్ కార్మికులు

- Advertisement -

 సీడీఎంఏ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష
నవతెలంగాణ -పరకాల 

తమను అకారణంగా విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ, న్యాయం చేయాలని కోరుతూ పరకాల మున్సిపాలిటీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయం ఎదురుగా చేపడుతున్న 24 గంటల నిరాహార దీక్షలో పాల్గొనేందుకు సీఐటీయూ కార్మిక సంఘం అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్ నేతృత్వంలో కార్మికులు హైదరాబాద్‌కు బయలుదేరారు.

గత 30 సంవత్సరాలుగా, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ప్రస్తుత మున్సిపాలిటీ వరకు పరకాల ప్రజలకు తాము నిరంతరం సేవలందించామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించామని, అయినప్పటికీ 60 సంవత్సరాలు నిండాయనే నెపంతో తమను ఉన్నఫళంగా విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని, కనీసం ఈ ప్రస్తుత ప్రభుత్వమైనా మానవతా దృక్పథంతో ఆలోచించి తమ 22 కుటుంబాలకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి కార్మికులు కోగిల సుమన్, ఒంటేరు లింగయ్య, బొచ్చు సారయ్య, కొమ్ముల మహేష్, బొచ్చు విజయ్, ఒంటేరు రాజేష్, బొచ్చు నరసయ్య, ఒంటేరు అశోక్, ఒంటేరు సారయ్య తదితరులు తరలి వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -