Saturday, September 19, 2026
E-PAPER
Homeఆటలుసాయి సుదర్శన్‌ అవుట్‌

సాయి సుదర్శన్‌ అవుట్‌

- Advertisement -

బెంగళూరు : శ్రీలంకతో టెస్టు సిరీస్‌‌కు ముందు భారత్‌‌కు మరో ఎదురుదెబ్బ. టాప్‌ ఆర్డర్‌ ‌బ్యాటర్‌ ‌సాయి సుదర్శన్‌ ‌గాయంతో టెస్టు సిరీస్‌‌కు దూరమయ్యాడు. భారత్‌-ఏ తరఫున శ్రీలంకలో రెండు సెంచరీలు సాధించిన సాయి సుదర్శన్‌ ఆ టూర్‌లో కాలు బొటనవేలు గాయానికి గురయ్యాడు. తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడని భావించిన సెలక్షన్‌ ‌కమిటీ అతడిని జట్టులోకి తీసుకుంది. సాయి సుదర్శన్‌ ఆశించిన సమయంలో కోలుకోలేదు. దీంతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఆడటం లేదని బీసీసీఐ తెలిపింది. సాయి సుదర్శన్‌ ‌స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -