Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు ఎస్బీఐ ఓకే

ప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు ఎస్బీఐ ఓకే

- Advertisement -

రాయదుర్గం భూ వివాదంపై
ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాయదుర్గం భూ వివాదం విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రతినిధులతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ నెల 22న సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా శనివారం హైదరాబాద్ లోని సచివాలయంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్
ప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు సుల్తానియా, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ కె.శశాంక, ఎస్బీఐ తరఫున తెలంగాణ సీజీఎం జి.ఎస్. రాణా, ఏజీఎం జి. పూవళగి పాల్గొన్నారు. చర్చల సందర్భంగా, ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రదేశాలను ప్రతినిధుల బృందం సందర్శించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ముందుంచిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు ఎస్బీఐ ఆమోదం తెలిపింది. తమ బోర్డు ఆమోదం పొందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్బీఐ అధికారులు తెలియజేశారు. కొనసాగుతున్న కోర్టు విచారణలకు అనుగుణంగా ఈ విషయంలో అవసరమైన చర్యలు కూడా ప్రారంభించబడతాయన్నారు. చర్చల అనంతరం, ఎస్బీఐ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వచ్చినట్టు ప్రకటించారు. అవసరమైన చట్టబద్ధమైన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత ఈ విషయం వేగంగా ముగించబడుతుందని వారు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -