వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మున్సిపాల్టీలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్లు నిర్మాణంలో ఉన్న తప్పుల తడకలును సరి చేయాలని, భవిష్యత్తులో ప్రజల అభ్యంతరాలు లేకుండా మార్పులు చేయాలని మంగళవారం మున్సిపాల్టీ అధికారి సందీప్ కు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా అధికారిక ప్రతినిధి యూ.ఎస్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రధానంగా పేరాయ గూడెం పంచాయతీ మున్సిపాలిటీగా ఏర్పడి అశ్వారావుపేటలో కలిసింది అని అక్కడ ఏర్పడిన డివిజన్లలో నిర్మాణం గందరగోళం ఉందని తెలిపారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా ఎక్కడ ఏ అవకతవకలు ఉన్న సరిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీ నిర్మాణాన్ని నెలకొల్పాలని, అలాగే పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని వినతి పత్రంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ డివిజన్లలో నిర్మాణ మార్పులు చేర్పులు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES