Wednesday, May 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-సిర్పూర్(టి)
మండల కేంద్రంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా జాతీయ హరితదళం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ సంరక్షణకు సంబంధించిన పాటలు పాడి, నృత్యాలు చేసి, నాటికలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు జాతీయ హరితదళం తరఫున సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జాతీయ హరితదళం కోఆర్డినేటర్, పర్యావరణ విద్య అంబాసిడర్ కటకం మధుకర్ మాట్లాడుతూ.. ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను విద్యార్థులు గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, మొక్కల పెంపకం తగ్గడం, అడవుల సంరక్షణ లోపించడం వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు దేవారావు, ఉపాధ్యాయులు జమునదాస్, సంతోష్, సందీప్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

పోటీల ఫలితాలలో పాటల పోటీల్లో సౌమ్య, శ్రావణి విజేతలుగా నిలిచారు. నృత్య పోటీల్లో సౌమ్య, జోష్ణ, శ్రావణి, సునీత, పావని ప్రతిభ కనబరిచారు. నాటికల ప్రదర్శనలో శ్రావణి, సౌమ్య, జోష్ణ, పావని, సునీతలకు బహుమతులు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -