ఇంటింటికి ప్రచారం చేస్తున్న అధ్యాపకులు
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కళాశాల అధ్యాపకులు సూచించారు. ఆదివారం మండలంలోని బెల్గాం గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో అన్ని వసతులతో కూడిన విద్యా బోధన, మంచి అధ్యాపక బృందం, కళాశాల ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని గుర్తు చేశారు.
అదేవిధంగా ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రభుత్వ కొలువులు సాధించారన్నారు. దింతో తల్లిదండ్రులువిద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా ప్రభుత్వం పాఠశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ కళాశాలలో ఉచిత విద్య పాఠ్యపుస్తకాలు మరియు మధ్యాహ్న భోజనం పథకాలను ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుందని తల్లిదండ్రులను సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సంపత్, శేఖర్,శ్రీనివాసరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



