ప్రాణాపాయ స్థితిలో రవీందర్ రెడ్డి
భూతగాదాలే కారణం.?
నవతెలంగాణ – వర్ధన్నపేట
భూతగాధ కక్షలతో గుర్తుతెలియని దుండగలతో ఓ వ్యక్తి గొంతు కోయించే దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారు. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ కు తరలించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామం పరిధిలోని దొడ్లగడ్డ ప్రాంతానికి చెందిన న్యాయం రవీందర్ రెడ్డిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి తప్పించుకోనీ పరారయ్యారు.
వ్యవసాయ బావి వద్ద రవీందర్ రెడ్డి కోసం కాపు కాసి పక్కా ప్లాన్ తో వేట కొడవలితో గొంతు కోసి పరారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న వర్ధన్నపేట పోలీసులు ప్రాణాపా స్థితిలో ఉన్న రవీందర్ రెడ్డిని హుటాహుటిన ఆస్పటల్ తరలించి నిందితుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా రవీందర్ రెడ్డితో భూతగాధ గొడవలు జరుగుతున్నట్లు, ఆదివారం రోజు ఇతర ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు వచ్చి గొంతు కోసి తప్పించుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



