Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విశాఖ కాలనీ ఎంప్లాయిస్ సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే

విశాఖ కాలనీ ఎంప్లాయిస్ సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ 7వ వార్డు పరిధిలో  విశాఖ కాలనీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాలనీ వాసులు ఆదివారం కోరారు. కాలనీ బస్సులు కాలనీలోని సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు. రమా సత్యనారాయణ స్వామి ఆలయ కమ్యూనిటీ హాల్ కొరకు పది లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఇవ్వాలని, కాలనీలో ఓపెన్ జిమ్, పార్కు అభివృద్ధికి కృషి చేయాలని, కాలనీలో ఇంటర్నల్ నూతన రోడ్స్ వేయించాలని విజ్ఞప్తి చేశారు.

అందుకుగాను త్వరలోనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మీ విషయాలను సానుకూలంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే విశాఖ నగర్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వంఆర్థికంగా చాలా బలహీనంగా ఉందని, కాబట్టి నేను ఎలాగైనా కృషిచేసి మీ కాలనీ అభివృద్ధికి తోడ్పడు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పట్టు శాలువాతో కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఒకసారి విశాఖ నగర్ కాలనీ, సత్యనారాయణ టెంపుల్ ను ఎమ్మెల్యే సందర్శించి మా కాలనీలోని సమస్యలను తెలుసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరగా, తప్పకుండా వస్తానని  ఎమ్మెల్యే వారితో చెప్పారు. ఎమ్మెల్యేకు విన్నవించిన వారిలో  విశాఖ నగర్ కాలనీ వాసులు లక్ష్మీ నరసయ్య, జగదీశ్వర్,డి. రాములు, లిక్కి గంగాధర్ ,రామన్నపేట గంగాధర్ ,రాస శ్రీనివాస్, లక్ష్మణ్, రాస దయాకర్, మట్ట చిన్న రాజేందర్, హరిప్రసాద్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -