Sunday, April 19, 2026
E-PAPER
Homeక్రైమ్బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు...17మంది మృతి

బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు…17మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్ : తమిళనాడులో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్ నగర్ జిల్లాలోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక బృందాలు.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -