అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హే చికీతా’.
ధన్ రాజ్ లెక్కల దర్శకత్వం వహించారు. ఈ మూవీని జూలై 24న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో టీజర్‌ను సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, జి. నాగేశ్వర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, రామసత్య నారాయణ, దర్శకులు దశరథ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ,’అంజి వల్లే నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఊర్లో ఉండే ఓ ఐదుగురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారు అన్నది ఈ సినిమా కథ. దివిజ, అభినవ్ చక్కగా నటించారు. రైతుల గురించి మాట్లాడే, ఆలోచించే ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు.
నిర్మాత గరుడవేగ అంజి మాట్లాడుతూ,’సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మేం ఎంతో మంది గొప్ప దర్శకుల్ని, ఆర్టిస్టుల్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాం. జూలై 24న మా సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నాం. కంటెంట్ ఉంటే డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు, ఆడియెన్స్ అందరూ సపోర్ట్ చేస్తారు` అని తెలిపారు.
రైతే రాజు కాన్సెప్ట్..
- Advertisement -
- Advertisement -



