Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు అండగా నిలవాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పం

రైతులకు అండగా నిలవాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పం

- Advertisement -

సీఎం సభను విజయవంతం చేయాలి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు అండగా నిలువాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం కాళేశ్వరంలోని మెడిగడ్డ, నస్తూరిపల్లి నిర్వహించనున్న సిఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సిఎం రేవంత్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు నేతృత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సందర్భంగా రెండో విడుత రైతు భరోసాను సిఎం తోపాటు, క్యాబినెట్ మంత్రి వర్గంచే విడుదల చేయబోతోందన్నారు. కావున మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాళ్లు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బండారి నర్సింగం, బండి స్వామి, కొండ రాజమ్మ, గడ్డం క్రాంతి, మేకల రాజయ్య, చంద్రగిరి సంపత్, అబ్బినేని లింగస్వామి, ఉప సర్పంచ్లు లకావత్ సవేందర్, బొబ్బిలి రాజు గౌడ్, తాళ్ల రవిందర్, అక్కల దేవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంపయ్య, రాజైలు, రాహుల్, లక్ష్మీ రాజు, కత్తెరసాల, కేశారపు చెంద్రయ్య, సమ్మయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -