Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయంఏపీలో ‘ఏకరీతి హెయిర్ స్టైల్ విధానం’

ఏపీలో ‘ఏకరీతి హెయిర్ స్టైల్ విధానం’

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: సినిమాలు, సోషల్ మీడియా, క్రీడాకారుల ప్రభావంతో విభిన్న హెయిర్ స్టైల్స్‌ను అనుసరించే విద్యార్థులకు ఇకపై బ్రేక్ పడనుంది. ఏకరూప దుస్తుల మాదిరిగానే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే బాలురందరూ ఒకే తరహా హెయిర్ కట్‌తో పాఠశాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాఠశాలల్లో కొందరు విద్యార్థులు సినీ హీరోలు, క్రికెటర్లను అనుకరిస్తూ విభిన్న హెయిర్ స్టైల్స్‌తో వస్తుండటంతో చదువు కంటే రూపురేఖలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమానత్వ భావన పెంపొందించడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ హెయిర్ స్టైల్స్‌కు నిషేధం ….

విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం …. పాఠశాలల్లో ఈ క్రింది హెయిర్ స్టైల్స్‌ను అనుమతించరు.

స్పైకీ (Spiky)

ముల్లెట్ (Mullet)

ఫేడ్ ప్యాటర్న్స్ (Fade Patterns)

ఎక్స్‌ట్రీమ్ ఫేడ్ (Extreme Fade)

హెయిర్ కలరింగ్ (Hair Coloring)

ఇలాంటి హెయిర్ స్టైల్స్ పాఠశాల వాతావరణాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, తోటి విద్యార్థుల దృష్టిని కూడా మరల్చే అవకాశం ఉందని విద్యాశాఖ పేర్కొంది.

అన్ని పాఠశాలలకు వర్తింపు ….

ఈ ‘ఏకరీతి హెయిర్ స్టైల్ విధానం’ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల విద్యార్థుల మధ్య అనవసర పోటీ తగ్గుతుందని, వారి రూపురేఖలపై ఆసక్తి తగ్గి …. చదువు, క్రమశిక్షణ, పాఠశాల సంస్కృతిపై మరింత దృష్టి పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -