Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తాం

రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తాం

- Advertisement -

గారేపల్లి(కె) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం
నవతెలంగాణ – కాటారం

కాటారం మండలంలోని గారేపల్లి(కె) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ నూతన అధ్యక్షుడిగా శ్రీ తోటపల్లి ప్రశాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా దెబ్బేట స్వామి బాధ్యతలు చేపట్టగా, పాలకవర్గ సభ్యులుగా చీమల సత్యం, జక్కుల అజయ్ కుమార్, ఐలి రాజబాబు, బాసాని హిమాకర్, బండి రమేష్, దండ్రు రాజయ్య, అయిత కృష్ణవేణి, మారపాక రాజేశ్వరి పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తోటపల్లి ప్రశాంత్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, రుణాలు సమయానికి అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామీణ రైతాంగానికి అండగా నిలుస్తూ పారదర్శకంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఉపాధ్యక్షుడు దెబ్బేట స్వామి మాట్లాడుతూ రైతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. పాలకవర్గ సభ్యులు కూడా సంఘ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో  సీ ఓ ఎడ్ల సతీష్, సిబ్బంది, రైతులు, సహకార సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -