Friday, July 3, 2026
E-PAPER
Homeమానవివంట చేసేటప్పుడు

వంట చేసేటప్పుడు

- Advertisement -

వంట చేసేటప్పుడు నూనె తుంపర్లు పడటం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఇవి మనకు గాయాలను చేస్తుంటాయి. లేదంటే గ్యాస్ స్టవ్ పై జిడ్డు మరకలు ఏర్పడతాయి. వంటగదిలో పాటించే కొన్ని చిన్న చిన్న అలవాట్లు నూనె చిందడాన్ని అదుపు చేస్తాయి. మీ వంటను సురక్షితంగా మార్చే ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

తడి లేకుండా ఆరబెట్టండి
నూనె, నీరు అస్సలు కలవవు. కూరగాయలు లేదా పనీర్ కడిగిన తర్వాత వాటిపై తేమ ఉంటే నూనె చిటపటలాడుతుంది. అందుకే వండే ముందు కిచెన్ టవల్ లేదా టిష్యూతో పదార్థాలను తడి లేకుండా అద్దండి.

చిటికెడు ఉప్పు మ్యాజిక్
పదార్థాలు వేయడానికి ముందు నూనెలో చిటికెడు ఉప్పు చల్లండి. ఇది నూనెలో మిగిలిపోయిన తేమను పీల్చుకుని నూనె చిందకుండా అరికడుతుంది.

సరైన ఉష్ణోగ్రత
నూనె మరీ ఎక్కువగా వేడెక్కి పొగలు వస్తుంటే అది చిందడానికి ప్రధాన కారణం అవుతుంది. మధ్యస్థ మంట మీద నెమ్మదిగా వేడెక్కనివ్వాలి.

మూతను వాలుగా పెట్టండి
పాత్రను పూర్తిగా మూయకుండా, ఆవిరి బయటకు పోయేలా మూతను కొద్దిగా వాలుగా పెట్టండి. దీనివల్ల నూనె బయటకు ఎగిరిపోదు, అదే సమయంలో ఆహారం ముద్ద అవ్వకుండా క్రిస్పీగా వస్తుంది.

లోతైన కడాయిని వాడండి
చదునైన ప్యాన్‌ల కంటే లోతైన కడాయిలు నూనెను అంచుల లోపలే ఉంచుతాయి. వేయించే ఆహారాలకు ఇవి చాలా సురక్షితం.

ఒకేసారి ఎక్కువ వద్దు
బాణలిలో ఒకేసారి చాలా పదార్థాలు వేయడం వల్ల నూనె ఉష్ణోగ్రత తగ్గి తేమ విడుదలవుతుంది. ఫలితంగా నూనె చిందుతుంది. కాబట్టి విడతల వారీగా వండటం మంచిది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -