- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటకలో రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం తన ప్రియునితో కలిసి భర్త- మాజీ సైనికుడు సందీప్‌ను హత్య చేసిన సుమ అనే మహిళతో కలిపి మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశామని యమకనమరడి ఠాణా పోలీసులు తెలిపారు. మార్చి 13న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన సందీప్‌కు, మార్చి 15న సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించి సుమ, పుండలీక హత్య చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. సందీప్ సోదరుడి ఫిర్యాదుతో మొదట సుమ, పుండలీకను అరెస్టు చేయగా, తదుపరి విచారణలో మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



