Saturday, May 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడులు బలోపేతం అయ్యేనా.!

బడులు బలోపేతం అయ్యేనా.!

- Advertisement -

పేరెంట్స్ చేతికి ప్రభుత్వ పాఠశాలలు
బడ్జెట్ అభివృద్ధి బాధ్యత వారిదే
ఎస్ఎంసి,హెచ్ఎం లకు జాయింట్ చెక్ పవర్
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ బడుల బలోపేతం దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తం అవుతున్న నేపథ్యంలో సర్కారు బడులు బలోపేతం అయ్యేనా.?అనే సందేహాలు వినిపిస్తున్నాయి.ఇకపై పాఠశాలల నిర్వహణ,బడ్జెట్ బాధ్యతలను నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకే అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది.ఎస్ఎం సీలకు, హెచ్ఎంలకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వనున్నట్లుగా సమాచారం.కమిటీలో 75 శాతం పేరెంట్స్,25 శాతం ఇతరులు ఉండేలా చర్యలు తీసుకుంటుంది.ఇందులో 50 శాతం మహిళలే ఉంటారు.జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు జరగనున్నట్లు సమాచారం.

కేంద్రం 60,రాష్ట్రం 40 శాతం..
ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రస్తుతం ఇస్తున్న సమగ్ర శిక్ష నిధులలో కేంద్రం 60 శాతం,రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తున్నాయి.ఇక పీఎంశ్రీ స్కూళ్లకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది.రెండేళ్లుగా ఎస్ఎంసీ కమిటీలు లేకపోవడంతో వాటి స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు.అప్పట్లో ఎస్ఎంసీ కమిటీ చైర్మన్, హెచ్ఎంకు పాఠశాల నిధులపై జాయింట్ చెక్ పవర్ ఉండేది. ప్రస్తుతం అమ్మ ఆదర్శ కమిటీలు నామినేట్ కావడంలో వారికి చెక్ పవర్ లేదు.

పేరెంట్స్ కమిటీలే పవర్ ఫుల్..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠశాల నిర్వహణలో.. బడ్జెట్ ఖర్చులో పేరెంట్స్ కమిటీలే పవరు ల్ గా మారబోతున్నాయి.కమిటీ చైర్మన్కు, పాఠశాల హెచ్ఎంకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వనున్నారు.తల్లిదండ్రుల అనుమతి లేకుండా, ఒక్క రూపాయి కూడా వాడేందుకు వీలు లేదు. పాఠశాలలో రూ.30 లక్షల లోపు నిర్మాణ పనులను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అనుమతి లేకుండానే ఎస్ఎం సీలు నేరుగా చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను సేకరిం చేందుకు అనుమతి కల్పించారు.

ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే..
నిధుల వినియోగంలో పారదర్శకత పాటించేందుకు ప్రభుత్వ ఆడిట్ తోపాటు వార్షిక సోషల్ ఆడిట్ ను తప్పనిసరి చేశారు. బడులకు వచ్చే ప్రతి పైసా ఖర్చుల వివరాలను పబ్లిక్ నోటీస్ బోర్డుపై బహిరంగంగా ప్రదర్షించాలి.జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తూ ఏదైనా అవకతవకలు జరిగితే పోలీస్,ఆరోగ్య శాఖలతో కలిసి నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఎస్ఎంసిలకు ఇచ్చారు.

కమిటీలో 75 శాతం తల్లిదండ్రులే..
ఎస్ఎంసీ కమిటీలో 75 శాతం తల్లిదండ్రులే ఉంటారు.25 శాతం టీచర్లు,పంచాయతీ సభ్యులు,కౌన్సిలర్, పూర్వ విద్యార్థులు, స్థానిక విద్యావేత్తలు మొదలగువారు ఉంటారు. మొత్తం కమిటీలో 50 శాతం మహిళలు ఉంటారు. కమిటీ పదవీకాలం రెండేళ్లు.ప్రతి నెలకోసారి కమిటీ విధిగా సమావేశం కావాలి.ఈ విషయమై ఏఈఓ లక్ష్మన్ బానును వివరణ కోరగా ఇంకా కొత్త విధానంపై స్పష్టత రాలేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -