Homeతెలంగాణ రౌండప్ఘనంగా ప్రపంచ గుండె దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రపంచ గుండె దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
హృదయ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. ప్రపంచ హార్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ, మెడిసిటి హాస్పటల్స్ & మెడినోవా హాస్పటల్స్ ఆధ్వర్యంలో గురువారం ఆలేరు పట్టణంలో హృదయ ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆలేరు మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. నేటి జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు.

 ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగతాగడం మరియు ఇతర అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రజల్లో హృదయ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఆలేరు ఎస్ ఎచ్ ఓ జి. ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. ఆరోగ్యమే ప్రతి వ్యక్తికి ప్రధాన సంపద అని అన్నారు. గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించి, వెంటనే వైద్య సహాయం పొందడం ఎంతో ముఖ్యమని తెలిపారు. యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతిరోజూ శారీరక వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు , కౌన్సిలర్ లు యాట శివ , మల్లెల సరిత శ్రీకాంత్, పాకాల మౌనిక హరీష్, మంగ నరసింహులు, బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ ,బిజెపి నాయకులు తునికి దశరద, వడ్డెమాను నరేందర్, ఐలి సందీప్, మెడిసిటి హాస్పటల్ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి, జిఎమ్  పూర్ణ, మార్కెటింగ్ మేనేజర్ కుమారస్వామి, నాగార్జున, నవీన్, రాజు రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, మెడిసిటి హాస్పటల్స్, మెడినోవా హాస్పటల్స్ వైద్య సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -