గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికలో ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం పెరుగుదల చూపిందంటూ మోడీ చెప్పుకున్న నమ్మశక్యంగాని కోతలు సద్దుమణగక ముందే-అమెరికా ముందు, ట్రంప్ పాలనా వ్యవస్థ ముందు సర్కారు సాగిల బడిందనే ఆరోపణ బండారం బట్టబయలు చేసింది. ఏకీకృత చెల్లింపుల మాధ్యమం (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్-యు.పి.ఐ)లో కొన్ని రకాల డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఈ లొంగుబాటు మన ఆర్థిక నిర్వాహకుల మరగుజ్జుతనాన్ని బయటపెట్టింది. మోడీ సర్కారు బూటకత్వాన్ని వెల్లడించే అంశాల జాబితానే వుంది. అంకెల గారడీ మాట అటుంచి ఇక్కడ అర్థం చేసుకోవలసింది కోట్లాదిమంది సామాన్యుల జీవితానుభవం. భారత దేశ ఆర్థిక విధానం మూల సారాంశం ముమ్మాటికి స్వీయ విధ్వంసం వైపే సాగుతున్నది. యు.పి.ఐ లావాదేవీలపై వేసే చార్జి కేవలం 0.4 శాతం మాత్రమేనని ప్రభుత్వం బుకాయిస్తున్నది. అది కూడా సాధారణ వినియోగదారుల మీద కాదనీ, యు.పి.ఐ యాప్ ద్వారా చెల్లింపులు అందుకునే వ్యాపారుల మీదనేనని నమ్మబలుకుతున్నది.
దాగని వాస్తవాలు
కాని ఇందుకు భిన్నమైన వాస్తవాల కథనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చార్జి చెల్లించే వారు కేవలం 0.4 శాతం మాత్రమేనని అంటున్నా అది విధించబడే లావాదేవీ రెండు వేలపైన వుంటే చాలు. ఇక్కడే అసలు మోసం వుంది. వినియోగ దారుల నుంచి వ్యాపారులు అందుకునే మొత్తాలను బట్టి చూస్తే 66 శాతం ఈ చెల్లింపుల జాబితాలోకే వస్తారు. కనుక చార్జీలు విధించబడే లావాదేవీలలో అత్యధిక భాగానికి ఈ ప్రతిపాదనలకు వర్తిస్తుంది. చిన్న వ్యాపారులు లేదా చిల్లర దుకాణాదారులు ఈ చెల్లింపులు చేయనవసరమే లేదని ప్రభుత్వం అంటుంది కానీ నిజానికి లక్ష రూపాయల వ్యాపార మంటే రూ.3300 లావాదేవీగా వుంటుంది. ఆఖరుకు ఇరుగుపొరుగున వుండే చిన్న కిరాణా దుకాణంలో, టైలర్ షాపులో కూడా రోజువారీ రూ.5000 నుంచి 10 వేల రూపాయల దాకా వ్యాపారం జరుగుతుంది. కనుక వాస్తవ లెక్కల ప్రకారం చూస్తే చిన్న వ్యాపారాల్లో కూడా అత్యధిక భాగం ఈ నామకార్థపు చార్జి అనబడేదాన్ని మోయవలసి వుంటుంది. యు.పి.ఐ వంటి యాప్ ఒక్క భారత దేశంలోనే వుందని కూడా ప్రభుత్వం చెబుతున్నది. అందువల్ల బ్యాంకు ఖర్చుల కింద, సర్వర్లు ఉద్యోగుల ఖర్చుల కింద చాలా పెద్ద మొత్తం భరించవలసి వస్తుందని అంటున్నది. దాన్ని తట్టుకోవడం కోసం మాత్రమే ఈ కొద్దిపాటి ఫీజు వసూలు చేస్తున్నట్టు చెబుతున్నది.
ఎవరిపై ఈ మోసం?
అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తేనే గత ఏడాది బ్యాంకుల సమీకృత లాభం రూ.నాలుగు లక్షల కోట్లు. ఆఖరుకు యు.పి.ఐ ని నిర్వహించే ఎన్.సి.పి.ఐ అనే ప్రభుత్వ రంగ సంస్థకు కూడా 19 వేల కోట్ల లాభం, 7 వేల కోట్ల నిల్వ వచ్చింది. ఈ మిగులు నుంచి రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి రూ.2.87 లక్షల కోట్ల చెల్లింపు చేసింది. పైగా యు.పి.ఐ తోపాటు డిజిటల్ లావాదేవీలకు ఉపయోగిస్తున్న మరో రెండు యాప్‌లు అమెజాన్, గూగుల్ అనే రెండు బడా బహుళజాతి కంపెనీలకు చెందినవి. ఈ వినియోగదారులకు సంబంధించిన వాణిజ్య వివరాల డేటాను అమ్మడం ద్వారా వాటికి భారీ ప్రయోజనం సమకూరుతుంది. కనుక యుపిఐ లావాదేవీల మీద చార్జీలు విధించడం ఎందుకంటే అమెజాన్, గూగుల్‌లకు పోటీ లేకుండా చేయడం కోసమే. కానీ నష్టపోయేదెవరంటే చిన్న వ్యాపారులు, భారతదేశంలో సాధారణ వినియోగదారులు మాత్రమే.
కనుక ప్రభుత్వం ఎవరిని మూర్ఖులను చేయాలనుకుం టున్నది? ఉన్న చార్రితిక సందర్భం నుంచి ఈ మొత్తం వివా దాన్ని విడదీసి చర్చించడం సాధ్యం కాని పని. 2016 నవంబరు 8న దురదృష్టకరమైన సాయంత్రం మోడీ ఒక్క చావు దెబ్బతో రూ.500, రూ.1000 పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రసంగంలో ప్రకటించారు. నల్లడబ్బు ఎలా చలామణి అవు తుందో ఏమాత్రం తెలియని వారు మాత్రమే, హిందీ సినిమాలలో వలె దిండు కవర్లలో, మట్టి కుండలలో, అలాగే పరుపుల కింద దాన్ని దాచిపెడతారని అనుకుంటారు. బహుశా మోడీ, ఆయన సలహాదారులు అలాగే భావించి వుంటారు. 2017-18 ఆర్బిఐ నివేదిక ప్రకారం చూస్తే నోట్ల రద్దుతో రూ.15.41 లక్షల కోట్ల డబ్బు రద్దయిపోయింది. అయితే అందులో 99.30 శాతం అంటే రూ.15.30 లక్షల కోట్లు మళ్లీ బ్యాంకింగు వ్యవస్థలోకి ప్రవేశించింది. అంటే మొదట చెప్పిన అంచనా ఎంత మూర్ఖమైందో తేలిపోయింది.
యు.పి.ఐ నిజాలు
సామాన్య ప్రజల విపరీత కడగండ్లు, వాటి పర్యవసానంగా పెల్లుబికిన ప్రజాగ్రహం ఫలితంగా ప్రభుత్వం యు.పి.ఐ యాప్‌ను ప్రారంభించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ప్రధానమంత్రి స్వయంగా ప్రైవేట్ వాలెట్లను ప్రోత్సహి స్తున్నప్పటికీ ప్రభుత్వం ఇలా చేయక తప్పలేదు. రోజువారీ చిన్న చిన్న లావాదేవీలను డిజిటలైజ్ చేయడంలో యుపిఐ చేసిన దోహదం చాలా వుంది. ఇప్పుడు ఈ చార్జీల విధింపుతో డిజిటల్ వ్యాపార వాతావరణం విచ్ఛిన్నమయ్యే ముప్పు ఆవరించినట్టే. భారత ఆర్థిక వ్యవస్థ పతన దిశలో దిగజారడానికి నోట్ల రద్దు మొదటి వాక్యమైంది. నగదు లావాదేవీలతో యథాలాపంగా సాగే చిన్న వ్యాపార ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. సూక్ష్మ, చిన్న సంస్థల రంగం కకావికలు చేయబడింది. ప్రత్యేకించి చిన్న వ్యాపార రంగంలో అది భారీగా ఉద్యోగావకాశాలు బలితీసుకుంది. వాగాడంబరపు ప్రధాన మంత్రి, ఆయన వంధిమాగధ బృందాలు ఈ మరణాంతక స్వయంకృతాపరాధానికిగాను క్షమాపణ చెప్పాలని ఏ సమయంలోనూ అనుకోకపోవడం వేరే విషయం.
తథ్యమనే చెప్పాలి.
ఆందోళనల విస్ఫోటనం
అలాంటి బుద్ధిహీనమైన విధానకర్తలే 7.8 శాతం జీడీపీ పెరుగుదల గురించి గొప్పలు పోగలరు. కానీ వాస్తవం చాలా కఠోరంగా వుంది. 2026 ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం భారతదేశం అంతర్జాతీయంగా అసమానతలు అత్యంత ఎక్కువగా వున్న దేశాలలో ఒకటిగా వుంది. బాగా పైనున్న అధికాదాయపరులే మొత్తం ఆదాయంలో 58 శాతం సంపాదిస్తున్నారు. కాగా ఆదాయపరంగా జనాభాలో దిగువనున్న 58 శాతం మంది కేవలం 15 శాతం మాత్రమే పొందగలుగుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక పంపిణీలో అత్యధిక భారతీయులు కిందనున్న యాభై శాతంలోనే వుంటు న్నారు. అదే విధంగా కేంద్రీకరణలో కూడా పైనున్న ఒకే ఒక్క శాతం మంది జాతీయ సంపదలో సుమారు నలభై శాతం పొందుతున్నారు. పైనున్న పది శాతం జాతీయ సంపదలో 65 శాతం తీసేసుకుంటున్నారు. మిగిలిన తొంభై శాతం మంది కేవలం 6.4 శాతంతో సరిపెట్టుకుంటున్నారు. ఇంకా స్ర్తీల పట్ల వివక్ష, శ్రామికుల అసమానతలు కూడా కలిపి చూస్తే ఈ అసమానతల చిత్రం ఇంకా పెద్దగా వుంటుంది. మహిళా శ్రామికుల భాగస్వామ్యం 15.7 శాతం దగ్గర స్తంభించిపోయింది. ఈ జెండర్ వ్యత్యాసం దిగ్భ్రాంతి గొల్పేదిగా వుంది. వేతన శ్రమ చేసేవారిలో పురుషులతో పోలిస్తే స్ర్తీలు 61 శాతం మాత్రమే పొందగలుగుతున్నారు. మొత్తం పనిచేసే వారిలో 94 శాతం అసంఘటిత రంగంలోనూ సాదాసీదా పనులలోనూ వున్నారు. అంటే అర్థమేమంటే శ్రామికుల సామాజిక భద్రత అత్యంత అధ్వాన్నంగా వుందన్నమాట.
ఏమైనా ప్రభుత్వం మాత్రం తమ కార్పొరేట్ క్రోనీలను సంతోషపెట్టడం కోసం అదే విషపూరిత విధానాలను కొనసాగి స్తున్నది. పన్ను రాయితీలు, బ్యాంకు రుణాల మాఫీతో ఆదాయం, సంపద పెంచుకోవడానికి, రక్షించడానికి తోడ్పడుతోంది. విద్య, వైద్యం వంటి సామాజిక రంగాలకు నిధులను పెద్ద ఎత్తున కోత పెడుతోంది. ఈ కారణంగా అత్యంత విస్తారమైన స్థాయిలో అలజడికి, ఆందోళనకు దారితీస్తోంది. కార్పొరేట్లనూ క్రోనీలను మోసే విధంగా వున్న ప్రస్తుత విధానాలను ఉపసం హరించుకోవడంలో ప్రభుత్వం విఫలమైనంత వరకూ మనం ఒక విస్ఫోటన దిశలో సాగడం
(సెప్టెంబర్ 23 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)





కామెంట్లు (0)