విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
దుబాయ్ : దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ కమర్షియల్ విమానం గాల్లో ఉండగా రష్యా, ఉక్రెయిన్ పైలట్ల మధ్య భయంకరమైన ఘర్షణ జరిగింది. ఇది కాస్త హైజాక్ కలకలానికి దారితీసింది. ఓ పైలట్ సహ పైలట్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కుప్పకూల్చేందుకు యత్నించాడు. ఘటన సమయంలో విమానంలోనే ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లు సకాలంలో స్పందించి విమానాన్ని నియంత్రణలోని తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చాయి.
ఏం జరిగింది? : బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 180 మంది ఇజ్రాయిల్ ప్రయాణికులతో ఫ్లై దుబాయ్ విమానం FZ1073 టెల్ అవీవ్‌కు బయలుదేరింది.
గాల్లో ఉండగా హఠాత్తుగా విమానం కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే 34,000 అడుగుల ఎత్తు నుంచి 16,600 అడుగులకు అమాంతం పడిపోయింది. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలో ఏవియేషన్ వర్గాలకు రెండు కీలక ప్రమాద హెచ్చరికలు వచ్చాయి. తొలుత సాధారణ ఎమర్జెన్సీ కోడ్ 7700 అందింది. ఆ వెంటనే హైజాక్‌ను సూచించే 7500 కోడ్ ట్రాన్స్‌మిట్ కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
పైలట్ల మధ్య గొడవ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)