Magazines

ఏఐకి మరింత భద్రత

57 నిమిషాల క్రితం

కృత్రిమ మేధ (ఏఐ)
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 3 నిమిషాల చదవడం

స్వచ్ఛంద ఒప్పందంపై ట్రంప్, టెక్ దిగ్గజాల సంతకం
వాషింగ్టన్ : కృత్రిమ మేధ (ఏఐ)కు మరింత భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చే ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అగ్రశ్రేణి టెక్ ఎగ్జిక్యూటివ్‌లు సంతకాలు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవాళిని విపత్కర ప్రమాదాలకు గురిచేస్తోందంటూ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. వేగంగా అభివృద్ధి చెందు తున్న కృత్రిమ మేధపై సర్కారు నియంత్రణ విషయంలో తన ప్రభు త్వానికి ఉన్న సందేహాన్ని ట్రంప్ పునరుద్ఘాటిస్తూ ఏఐ నేతలను అధ్యక్ష భవనానికి మంగళవారం మధ్యా హ్న భోజనానికి ఆహ్వానించారు. సమావేశం అనంతరం ట్రంప్ ఈ స్వచ్ఛంద ఒప్పందాన్ని ప్రకటించారు. ఏఐ ఎగ్జిక్యూటివ్‌లతో ట్రంప్ మాట్లా డుతూ ‘విస్తృత స్థాయిలో స్వీయ నియంత్రణ ఉండాలని నమ్ముతు న్నాము. కానీ న్యాయ శాఖ, ఎఫ్‌బీఐ వంటి వాటి ద్వారా మనకు నియంత్రణ దానంతట అదే వస్తుంది’ అని అన్నారు.
ఒప్పందంలో ఏముంది?
ఏఐ మోడల్స్‌ను పర్యవేక్షించడానికి పటిష్టమైన నియంత్రణలను అమలు చేస్తామని, ఏదైనా సమస్య ఎదురైతే అవి పరిష్కారమయ్యాయని నిర్ధారించడానికి అంతర్గత బృందాలను ఏర్పాటు చేస్తామని ఒప్పందంపై సంతకాలు చేసిన ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ, గూగుల్, మెటా, ఎక్స్‌ఏఐ, ఎన్విడియా సంస్థల అధిపతులు హామీ ఇచ్చారు. ఉద్దేశించిన విధంగానే భద్రతా చర్యలు అమలవు తున్నాయని నిర్ధారించుకోవడానికి, తమ వ్యవస్థల భద్రతను మెరుగుపరచు కునేందుకు అవసరమైన ప్రమాణాలను, ఉత్తమ పద్ధతులను ఏర్పాటు చేయడానికి క్రమం తప్పకుండా సమావేశమవు తామని, స్వతంత్ర ఆడిటర్లతో భాగస్వాములమవుతామని తెలిపారు. అయితే థర్డ్ పార్టీ మదింపులు ఎవరు చేయాలో ఒప్పందం నిర్దేశించలేదు. భవిష్యత్తులో ఈ చర్యలను చట్టబద్ధం చేయవచ్చునని లేదా అధికారిక నిబంధనలుగా క్రోడీకరించవచ్చునని తెలిపింది. ‘కంపెనీలకు ఇది తప్పనిసరి అయినా, కాకపోయినా ప్రతి ఒక్కరికీ సురక్షితమైన భద్రతను అందించడానికి ఈ నియంత్రణలు, ఆడిట్లు అత్యంత కీలకమని మేము భావిస్తున్నాము. మా కంపెనీలన్నీ దీనిని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాయి’ అని ఒప్పందంలో తెలియజేశారు. ఒప్పందంపై సంతకం చేసిన వారిలో డరియో అమోడెయ్ (ఆంత్రోపిక్), గ్రెగ్ బ్రాక్‌మన్ (ఓపెనఏఐ), సుందర్ పిచాయ్ (గూగుల్), మార్క్ జుకర్‌బర్గ్ (మెటా), ఎలాన్ మస్క్ (ఎక్స్‌ఏఐ), జెన్సన్ హువాంగ్ (ఎన్విడియా) ఉన్నారు.


టెక్ దిగ్గజాలతో ఏకీభవించని ట్రంప్
ఏఐపై నియంత్రణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలన్న అంతర్జాతీయ సమాజం, పారిశ్రామిక ప్రముఖుల అభ్యర్థనను ట్రంప్ ప్రభుత్వం ఖాతరు చేయని విషయం తెలిసిందే. ఏఐపై నియంత్రణ కోరుతున్న వారిలో ఆంత్రోపిక్‌కు చెందిన అమోడెయ్ కూడా ఒకరు. ఏఐని మానవ నియంత్రణలో ఉండేలా చూసేందుకు, ప్రమాణాలను నిర్దేశించి అమలు చేయడానికి ఓ పర్యవేక్షక సంస్థను ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా సమన్వయం సాధించాలని గత వారం ఇరవై దేశాలు, యూరోపియన్ యూనియన్ పిలుపునిచ్చాయి. ఏఐపై నియంత్రణకు ఇటీవల జరిగిన ఐరాస సమావేశాలలో ఓపెనఏఐ, ఆంత్రోపిక్, హగ్గింగ్ ఫేస్ సీఈఓలు పిలుపు నిచ్చారు. అయితే దీనిని ఆ సమావేశాలలోనే ట్రంప్ తిరస్కరించారు. ఏఐని నియంత్రిం చడానికి చేసే ఏ ప్రయత్నాన్ని అయినా తన ప్రభుత్వం వ్యతిరేకిస్తుం దని ఆయన స్పష్టం చేశారు.

మానవ నియంత్రణ నుంచి చేజారుతోంది
ఏఐ ఏజెంట్లు అదుపు తప్పి సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలపై సైబర్ దాడులు చేస్తున్న కేసులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మానవ నియంత్రణ నుంచి ఏఐ చేజారిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అంతర్గత పరీక్షల సమయంలో భద్ర తాపరమైన ప్రమాదాన్ని గుర్తించిన ఓపెన్‌ఏఐ సంస్థ తమ తాజా ఏఐ మోడల్‌ను విడుదల చేయబోవడం లేదని రెండు రోజుల క్రితం ప్రకటిం చింది. తమ ఏఐ ఏజెంట్లు జాతీయ ఆరోగ్య సంరక్షణ డేటాబేస్‌తో సహా ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి అనధికారికంగా ప్రవేశించిన ఘటన లపై చాట్‌జీపీటీ ఇటీవలే బహిరం గంగా క్షమాపణలు చెప్పింది. టెక్ దిగ్గజాలు, ట్రంప్ మధ్య కుదిరిన ఒప్పందంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇందులో పెద్దగా వివరాలు లేవని, ఇది కట్టుబడి ఉండాల్సిన ఒప్పందం కాదని విమర్శకులు వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్