Magazines

ఈబీ-5 గ్రీన్ కార్డ్ ఫీజు భారీగా పెంపు

57 నిమిషాల క్రితం

EB-5 green card fees hiked significantly
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

విదేశీ పారిశ్రామికవేత్తలకు అమెరికా షాక్‌
నవంబర్‌ 30 నుంచి అమల్లోకి
వాషింగ్టన్: అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టి తద్వారా గ్రీన్‌కార్డ్‌ పొందా లనుకునే విదేశీయులకు ట్రంప్‌ సర్కార్‌ గట్టి షాక్ ఇచ్చింది. భారతీయ పారి శ్రామికవేత్తలు గ్రీన్ కార్డ్ పొందేందుకు అత్యంత నమ్మ కమైన మార్గంగా భావించే ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ దరఖాస్తు ఫీజులను రెట్టింపు చేస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెరికా సిటిజన్‌షిప్‌, ఇమిగ్రేషన్‌ సర్వీస్‌(యూఎస్సీఐఎస్) కొత్త నిబంధనలను ఖరారు చేసింది. పెరిగిన ఈ ఫీజులు నవంబర్ 30 నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు ప్రకారం, ఫారమ్ I-526 ఫీజు 3,675 డాలర్ల నుంచి ఏకంగా 7,615కు పెరిగింది. ఫారమ్ I-526ఈ ఫీజు 3,675 నుంచి 7,850కు పెంచారు. ఈ రెండు దరఖాస్తులకు అదనంగా మరో 75 డాలర్ల టెక్నాలజీ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. తమ ఏజెన్సీ పన్నుల ద్వారా కాకుండా దరఖాస్తుదారులు చెల్లించే ఫీజుల ద్వారానే నడుస్తుందని యూఎస్సీఐఎస్ పేర్కొంది. దరఖాస్తుల పరిశీలన, బ్యాక్‌గ్రౌండ్ చెక్, మోసాల నిర్ధారణ, ప్రోగ్రామ్ నిర్వహణ వంటి ఖర్చులన్నింటినీ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఉపయోగించుకునే వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్